Nikhil: '18 పేజస్'ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?

Nikhil : యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 18 పేజస్.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన అప్డేట్ ను చిత్ర బృందం వెల్లడించింది. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించింది. టైటిల్ తోనే సినిమా పైన ఇప్పిటికే ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో సినిమా పైన మరిన్నీ అంచనాలను పెంచేందుకు యూనిట్ రెడీ అయిపొయింది. కాగా ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా నిఖిల్.. కార్తికేయ 2 అనే సినిమాని చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com