త్రివిక్రమ్ అడిగితే ఆ క్యారెక్టర్ చేసేవాడిని : రాజశేఖర్

త్రివిక్రమ్ అడిగితే ఆ క్యారెక్టర్ చేసేవాడిని : రాజశేఖర్
ఒకప్పుడు స్టార్ హీరోలలో రాజ‌శేఖ‌ర్ ఒకరు. వందేమాతరం, అంకుశం, తలంబ్రాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

ఒకప్పుడు స్టార్ హీరోలలో రాజ‌శేఖ‌ర్ ఒకరు. వందేమాతరం, అంకుశం, తలంబ్రాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో పోటీపడిన నటులలో రాజశేఖర్ ఒకరు. అయితే ఈ మధ్య హీరోగా ఆయన అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ గడురవేగ సినిమా సక్సెస్‌‌తో కంబ్యాక్ అనిపించారు.. కానీ హీరోగా కాకుండా సినిమాలోని కీలక పాత్రలకి సంబంధించి రాజశేఖర్ ఆ మధ్య ఆఫర్స్ బాగానే వచ్చాయి.. కానీ ఇందులోని కొన్నింటిని ఆయనే వద్దనుకోగా, మరికొన్ని దర్శకనిర్మాతలు ఛాయిస్ గా అనుకోని మరొకరిని తీసుకున్నారు.

అలాంటిదే త్రివిక్రమ్ సినిమా ఒకటి. అదే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన s/o సత్యమూర్తి. ముందుగా ఈ సినిమాలోని ఉపేంద్ర పాత్రకి ముందుగా రాజశేఖర్‌‌నే అనుకున్నాడట త్రివిక్రమ్.. కాకపోతే ఆ ఆఫర్ తన వరకు రాకుండానే ఉపేంద్రకు వెళ్లిందట.. ఒకవేళ త్రివిక్రమ్ తనని అడిగి ఉంటే ఆ పాత్ర చేసేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజశేఖర్. ఈ సినిమాతో పాటుగా 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` సినిమాలోని ప్రకాశ్ రాజ్ చేసిన పాత్ర కోసం ముందుగా తననే అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేద‌ని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.

అయితే హీరోగానే కాకుండా మంచి పాత్రలు అనిపిస్తే ఏ పాత్ర చేయడానికైనా సిద్దేమేనని తెలిపాడు. కాగా యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌‌‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు రాజశేఖర్.

Tags

Read MoreRead Less
Next Story