Breaking News : హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

Breaking News : హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
X
కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా సినీనటులే ఉన్నారు.

కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా సినీనటులే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే తనలో కరోనా లక్షణాలు లేవని, అయినా క్వారంబైలో ఉన్నట్లు తెలిపాడు.

ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులంతా టెస్టులు చేయించుకోవాలని రామ్ చరణ్ సూచించాడు. త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. రామ్ చరణ్ కూడా త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక కొణిదెల కుటుంబం నుంచి చిరంజీవి, నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే!


Tags

Next Story