హీరో రవితేజ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఎవరిచ్చారంటే?

హీరో రవితేజ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఎవరిచ్చారంటే?
డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ.. ముందుగా సపోర్ట్ రోల్స్ చేస్తూ అక్కడి నుంచి హీరోగా ఎదిగాడు. అలా వరుసగా హిట్లు కొడుతూ... ఈ రోజు స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు.

ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అతి తక్కువ మంది హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ.. ముందుగా సపోర్ట్ రోల్స్ చేస్తూ అక్కడి నుంచి హీరోగా ఎదిగాడు. అలా వరుసగా హిట్లు కొడుతూ... ఈ రోజు స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు.

ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్న రవితేజ దాదాపుగా ప్రతి సినిమాకు రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్.. అయితే రవితేజ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అది ఏ సినిమాకో, ఎవరిచ్చారో తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదవాల్సిందే.

నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సినిమాకి నిర్మాత కూడా నాగార్జుననే కావడం విశేషం.. అయితే ఆ టైంలో హీరో నాగార్జున చేతుల మీదుగా రవితేజ తన తొలి రెమ్యునరేషన్ ను అందుకున్నారు. 3500 రూపాయల చెక్కును నాగార్జున సంతకం చేసి తనకీ ఇచ్చారని రవితేజ చెప్పుకొచ్చాడు.

ఐతే ఆ చెక్కును తానూ చాలా రోజుల వరకు దాచుకున్నానని, ఆ తర్వాత కొన్ని రోజులకు డబ్బులు అవసరం పడి బ్యాంకులో వేసుకున్నానని చెప్పుకొచ్చాడు. రవితేజ తాజాగా నటించిన క్రాక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story