Ravi Teja : రవితేజ సరసన మరో ఇద్దరు ..!

Ravi Teja : ఇండస్ట్రీకి కొత్త అంటే దర్శకులకి, హీరోయిన్ లకి ఛాన్స్ ఇవ్వడంలో మాస్ మహారాజా రవితేజ ఎప్పుడు ముదుంటారు. ఇప్పటికే చాలా మందికి అవకాశాలు ఇచ్చాడు రవితేజ.. ప్రస్తుతం మరో ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చేందుకు మాస్ మహారాజా సిద్దమయ్యాడు. రీసెంట్ గా ఓ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు రవితేజ. కొత్త కుర్రాడు శరత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ.. రాజీషా విజయన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే మలయాళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా తమిళ్ లో ధనుష్ నటించిన కర్నన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రవితేజతో నటించేందుకు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌషిక్ ను తీసుకున్నారు. ఇప్పటికే ఈ భామ నాగచైతన్యతో మజిలి అనే చిత్రాన్ని చేసింది. ఇప్పుడు రవితేజ సినిమాలో నటించబోతోంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి అనే సినిమాని చేస్తుండగా.. ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్ళు కూడా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ కావడం మరో విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com