యాక్షన్ తో కూడిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ టక్కర్: హీరో సిద్ధార్థ్

'బొమ్మరిల్లు', నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్. తాజాగా కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తవ్వగా జూన్,9 న తమిళ్, తెలుగు భాషల్లో భారీగా విడుదల కాబోతోంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. అయితే సిద్దార్థ్ సరసన దివ్యాంక కౌశిక్ కథానాయికగా మెరువనుంది. విడుదల తేది దెగ్గర పడుతుండటంలో చిత్ర బృదం ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది.
ఈ క్రమంలోనే "టక్కర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. "టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మంచి స్కేల్ లో తీశారు. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్ గారు. ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు" అని అన్నారు. అలాగే "జూన్ 9న టక్కర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా 100% అలరిస్తుంది" అని వెల్లడించారు. అలాగే ఈవెట్‌కు వచ్చిన నిర్మాత సురేష్ బాబు, వెంకటేష్, తరుణ్ భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ సహా అందరూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com