Sree Vishnu: హీరో శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

Sree Vishnu: క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు శ్రీ విష్ణు. విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. శ్రీ విష్ణు సినిమా అంటే డిఫరెంట్‌గానే ఉంటుంది అని ప్రేక్షకులతో అనిపించుకున్నాడు. అలాంటి హీరో ఇప్పుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో వైరల్ అయ్యింది.
'బాణం' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ఆ సినిమాతోనే హీరోగా నారా రోహిత్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అప్పటినుండి శ్రీ విష్ణుకు, నారా రోహిత్‌కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. రామ్‌తో కలిసి చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం శ్రీ విష్ణుకు మంచి బ్రేక్ ఇచ్చింది.
రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో శ్రీ విష్ణును ఆసుప్రతికి తరలించారంట కుటుంబ సభ్యులు. ప్రస్తుతం తనకు చికిత్స అందుతున్నట్టుగా సమాచారం. ఈ విషయంపై శ్రీ విష్ణు కుటుంబ సభ్యులు స్పందించల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com