Srikanth : నరేష్ ఆధ్వర్యంలో నడిస్తే సమస్యలు ఎదురవుతాయి ...!
Srikanth : మా విషయంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ కీలక నిర్ణయం తీసుకుంది.. తన ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.. మాలో రెండు వర్గాలకు చెందిన వారుంటే విభేదాలు వస్తాయని.. అందుకే రాజీనామాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.. ఈ ఎన్నికల్లో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన శ్రీకాంత్ మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో పరిణామాలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. విష్ణు తనకు తమ్ముడి లాంటి వాడని.. పాలకవర్గంలో రెండు వర్గాల వారు ఉంటే విభేదాలు వస్తాయని.. దాని వల్ల అభివృద్ధి జరగదని తెలిపారు. విష్ణు స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకాంత్ చెప్పారు... గతంలో 'మా'అధ్యక్షుడిగా చేసిన నరేశ్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు పనిచేస్తాడని శ్రీకాంత్ ఆరోపించారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చాలని లేదంటే ప్రశ్నిస్తామని అన్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com