అప్పుడు అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా : శ్రీకాంత్

అప్పుడు అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా : శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రనైనా సరే అలోవోకగా చేసే నటులలో శ్రీకాంత్ ఒకరు.

హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రనైనా సరే అలోవోకగా చేసే నటులలో శ్రీకాంత్ ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అంత బాధ కూడా ఉంటుంది. అయితే ఓ సంవత్సరంలో తానూ చేసిన ఏడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్టుగా హీరో శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆ ఏడు సినిమాలు కూడా పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ లనుంచి రావడం, అయినప్పటికీ ప్లాప్ కావడం తనని డిప్రెషన్ లోకి వెళ్ళేలా చేశాయాని శ్రీకాంత్ వెల్లడించారు. ఆ సమయంలో ఓ మూడు నెలలు ఎవరికి కనిపించలేదని ఒకనొక సమయంలో అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నానని శ్రీకాంత్ వెల్లడించారు. అయితే తానూ డిప్రెషన్ లో ఉన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి తెలుసుకొని పిలిపించుకొని మాట్లాడి చాలా మోటివేట్ చేశారని శ్రీకాంత్ వెల్లడించారు.

అప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయట పడి.. మళ్లీ సెకండ్ కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానన్నీ సంపాదించుకున్నానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు శ్రీకాంత్.

Tags

Read MoreRead Less
Next Story