Sumanth: హిట్ కాంబినేషన్ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్‌తో సుమంత్ రెండో సినిమా..
Sumanth: హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.

Sumanth: హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు.
పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ తెలిపారు.
RELATED STORIES
Naga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..
11 Aug 2022 5:20 AM GMTPoorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
11 Aug 2022 2:12 AM GMTNaga Chaitanya: తన టాటూతో సామ్‌కు ఉన్న కనెక్షన్ అదేనట..! బయటపెట్టిన...
10 Aug 2022 8:31 AM GMTMahesh Babu: 'ప్రియమైన సూపర్ ఫ్యాన్స్‌కు'.. మహేశ్ బాబు ట్వీట్..
10 Aug 2022 1:33 AM GMTపదేళ్ల సినీ ప్రయాణం పూర్తి.. ధన్యవాదాలు తెలిపిన హారిక అండ్ హాసిని...
9 Aug 2022 4:15 PM GMTMahesh Babu: రాజమౌళితో సినిమాపై స్పందించిన మహేశ్..
9 Aug 2022 2:30 PM GMT