Tanish : మోహన్ బాబు మా అమ్మని కించపరిచేలా బూతులు తిట్టారు : తనిష్

Tanish : మోహన్ బాబు మా అమ్మని కించపరిచేలా బూతులు తిట్టారు : తనిష్
Tanish : ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేశారు.. 'సినిమా బిడ్డలం’ ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్‌ ప్రకటించారు.

Tanish : ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేశారు.. 'సినిమా బిడ్డలం' ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో విష్ణు ప్యానల్ ఇచ్చిన హామీలకు ఎక్కడ కూడా ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఇక ఇదే మీడియా సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు...మోహన్ బాబు తనని తిడుతుంటే నటుడు బెనర్జీ అడ్డుకున్నాడని అన్నాడు. అయినప్పటికీ మోహన్ బాబు తన తల్లిని కించపరిచేలా తిట్టాడంటూ భాగోద్వేగానికి లోనయ్యాడు. మోహన్ బాబు ఎందుకలా ప్రవర్తించారో తెలియదని అన్నారు. తాను గెలవడంతో భవిష్యత్తులో అసోసియేషన్ మీటింగ్ కి వెళ్ళినా భయంతో అభిప్రాయాలను చెప్పుకోలేనని అన్నాడు. అందుకే ఈసీ సభ్యుడిగా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించాడు.


Tags

Read MoreRead Less
Next Story