నాకు అండ.. దండ మీరే.. దాడి చేయకండి : విశ్వక్‌సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం 'పాగల్'. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్‌సేన్ ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ విమర్శకులకు ఓ సందేశం ఇచ్చాడు.
"'నేను మీ విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. 'పాగల్' సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధి కలిగించే.. సినిమా థియేటర్స్‌ను కాపాడండి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..' అని పేర్కొన్నాడు.
కాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్‌సేన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com