టాలీవుడ్

జబర్ధస్థ్ జడ్జి మారింది.. రోజాకేమైంది!!

జబర్ధస్థ్ జడ్జి మారింది.. రోజాకేమైంది!!
X

జబర్థస్త్‌‌ షోలో డబుల్ మీనింగులు ఉన్నాయంటూనే చాలా మంది చూసే షోగా పేరు తెచ్చుకుంది. మంచి రేటింగ్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా అందులో నటించే వారికి జీవన భృతితో పాటు, పేరుని, సినిమాల్లో అవకాశాలని తెచ్చిపెడుతోంది. మరి ఇంత పాపులరైన ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలు ఒక అసెట్‌ అనే చెప్పాలి.

ఆధ్యంతం నవ్వుతూ అందులోని పార్టిసిపెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంటారు. అడపా దడపా జడ్జిలు మారినా మళ్లీ ఆ జంట వస్తేనే షోకి అందం అనేంతగా బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగబాబు, రోజాలు.

అయితే 2019లో నాగబాబు బయటకు వచ్చేసినా రోజా, గాయకుడు మనోతో తన జర్నీ కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె కూడా విరామం తీసుకున్నారు. మరి ఇంతకీ రోజా ప్లేసుని భర్తీ చేయాలంటే ఆమెకి సరిజోడీ కోసం అన్వేషణ ప్రారంభించింది జబర్ధస్త్ యూనిట్. ఆఖరికి ఇంద్రజను తీసుకొచ్చి జడ్జ్ సీట్లో కూర్చోబెట్టింది.

తాజా ఎపిసోడ్‌లో మనుతో కలిసి ఇంద్రజ సందడి చేశారు. కమెడియన్స్ వేసే జోకులకు సమయస్ఫూర్తితో స్పందిస్తూ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీనా, సంఘవి రోజా సీట్లో కూర్చుని జబర్దస్త్‌కి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంద్రజ వంతు వచ్చింది.

ఇంతకీ రోజాకు ఏమైందని ఆరా తీస్తే ఆమెకు చెన్నై అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి వివరించారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని సెల్వమణి అన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని, రెండు వారాల పాటు విశ్రాంతిలో ఉంటారని అన్నారు. అభిమాను లెవరూ ఆస్పత్రికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story

RELATED STORIES