టాలీవుడ్

'అమ్మ' పాత్రకు అడిగినంత ఇవ్వాలె.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్

అందం, ఆహార్యంలో హీరోయిన్స్‌తో పోటీ పడుతూ రెమ్యునరేషన్‌లో సైతం మేమేమీ తీసిపోం అంటున్నారు నిన్నటి తరం హీరోయిన్లు.

అమ్మ పాత్రకు అడిగినంత ఇవ్వాలె.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్
X

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు స్టార్ అమ్మలు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం, స్లిమ్‌గా, నాజూగ్గా ఉండే అమ్మలకే ఆడియన్స్ పట్టం కడుతున్నారు. అమ్మ అంటే ఆంటీలా ఉండకూడదు మరి. మోడర్న్ అమ్మ నేటి ట్రెండ్ సెట్టర్. అందం, ఆహార్యంలో హీరోయిన్స్‌తో పోటీ పడుతూ హావభావాలు ప్రదర్శిస్తూ రెమ్యునరేషన్‌లో సైతం మేమేమీ తీసిపోం అంటున్నారు నాటి తరం హీరోయిన్లు. రోజువారీ పేమెంట్ బేస్ మీద వారి రెమ్యునరేషన్ ఉంటుంది. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో సరదాగా ఓ లుక్కేద్దాం.

అత్తారింటికి దారేదిలో కనిపించిన నదియా.. అందమైన అమ్మ, అత్త.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు లభించకపోయినా, అమ్మ, అత్త క్యారెక్టర్లకు మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ రోజుకు 2 నుంచి 3 లక్షలు.

సావిత్రి తరువాత సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఇప్పుడు వారి తనయులకు అమ్మగా,అత్తగా నటించి అలరిస్తున్నారు. ఆమె ఓ సినిమాకు పది నుంచి పన్నెండు రోజులు కేటాయిస్తారు. అప్పుడు రోజుకి రూ2 లక్షలు తీసుకుంటారు. అంతకంటే ఒక్క రోజు ఎక్కువైనా మరో లక్ష అదనంగా చెల్లించుకోవాల్సిందేనట.

మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేవతి. హీరోయిన్‌గా తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా అమ్మ క్యారెక్టర్ కోసం ఆమె ఛార్జ్ చేసే మొత్తం రోజు వారీ కాకుండా సినిమాకు 20 నుంచి 25 లక్షలు తీసుకుంటారట.

ఇటీవలి కాలంలో పవిత్ర లోకేష్‌కి బాగా డిమాండ్ పెరిగింది. సాప్ట్ కేరెక్టర్‌తో, మోముపై చెరగని చిరునవ్వుతో ఉండే ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. అమ్మ పాత్రలో చక్కగా ఇమిడి పోయే పవిత్ర రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా డిమాండ్ చేయరట. రోజుకి 50 నుంచి 60 వేలు తీసుకుంటారట.

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన తులసి బాల నటిగా శంకరాభరణం చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. పెళ్లి తరువాత సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టిన తులసి అమ్మ, అక్క పాత్రలు చేస్తున్నారు. రోజుకి తులసి తీసుకునే రెమ్యునరేషన్ 35 వేల నుంచి 40 వేలు.

తెలుగులో రోహిణి చేసిన సినిమాలు తక్కువే అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రోహిణి బాగా పాపులర్ అయింది. హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి పాపులర్ అయిన రోహిణి అమ్మ, అక్క, ఆంటీ పాత్రల్లో చక్కగా ఒదిగిపోతుంది. ఆమె రోజుకి 50 నుంచి 60 వేలు తీసుకుంటుంది.

కోలీవుడ్‌లో అమ్మగా ఫేమస్ అయిన శరణ్య. ఇంద్రుడు, రఘువరన్ బీటెక్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా హీరోయిన్ కన్నా తల్లి పాత్రల ద్వారా శరణ్యకు ఎక్కువ పేరు వచ్చింది. రోజుకి ఆమె తీసుకునే రెమ్యునరేషన్ 40 నుంచి 50 వేల వరకు తీసుకుంటారు.

ఇక అందరికంటే ఎక్కువగా పారితోషికాన్ని తీసుకుంటున్న వారి లిస్టులో ముందు వరుసలో ఉండే నటి రమ్యకృష్ణ. హీరోయిన్లు సినిమాకి దాదాపు కోటి వరకు వసూలు చేస్తే రమ్యకృష్ణ రోజుకి రూ.6 లక్షల వరకు తీసుకుంటారని టాలీవుడ్ టాక్. వారిలో ఉన్న టాలెంటే వారిని ఈ స్థాయిలో నిలబెట్టింది అనేది తెలుసుకోవలసిన విషయం.

Next Story

RELATED STORIES