Ram Charan: 'రామ్ చరణ్ కోసం కథ రాయాలనుంది': హాలీవుడ్ రైటర్

Ram Charan: 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశాలను, ఖండాలను దాటి మరీ పాపులారిటీని దక్కించుకుంటోంది. ఇప్పటికి కేవలం దేశ నలుమూలల నుండి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రపంచంలో ఉన్న చాలావరకు నటీనటులు, మేకర్స్ ఈ సినిమాను కొనియాడారు. అంతే కాకుండా ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి పనిచేయాలనుంది అని కూడా తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఇక తాజాగా మరో హాలీవుడ్ రైటర్.. రామ్ చరణ్‌ను హాలీవుడ్‌లో డెబ్యూ చేయమంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్.. థియేటర్లలో విడుదలయినప్పుడు ఎన్నో సినీ రికార్డులను తిరగరాసింది. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉండడంతో భాష తెలియని ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ మూవీని ఇష్టపడడం మొదలుపెట్టారు. రాజమౌళి టేకింగ్‌తో పాటు ఎన్‌టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్‌కు కూడా సమానంగా మార్కులు పడ్డాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ గెటప్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇప్పటికే ఎంతోమంది హాలీవుడ్ మేకర్స్.. ఆర్ఆర్ఆర్‌పై ప్రశంసలు కురిపించగా.. తాజాగా హాలీవుడ్ రైటర్ ఆరన్ స్టీవర్ట్ ఆహ్న్ ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'రామ్ చరణ్‌లాంటి గొప్ప నటుడితో పనిచేయడం కోసం ఓ కథ రాయాలనుంది. ఒకవేళ ఆయన అంతర్జాతీయ ప్రొడక్షన్స్‌లో పనిచేస్తుంటే ఆయనే లీడ్ అయ్యిండాలి. కానీ హాలీవుడ్ అలా చేయదు. నేను ఇండియన్ సినిమాలను ఎప్పటికీ అభినందిస్తూనే ఉంటాను' అని ట్వీట్ చేశాడు ఆరన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com