Mohan Babu : నేను అసమర్థుడిని కాదు.. మౌనంగా ఉన్నానంతే - మోహన్ బాబు

Mohan Babu : టాలీవుడ్ లో మంచు తుపాన్ ఆగడం లేదు. ఇప్పుడు ఎన్నికల తంతు కూడా అయిపోవడంతో విమర్శల బాణాలు మొదలయ్యాయి. మోహన్ బాబు, మంచు విష్ణులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే భయపడి కాదు.. ఆ తరువాత విజృంభిస్తుంది.. గురి చూసి పంజా విసురుతుందని మోహన్ బాబు తన ప్రత్యర్ధులపై డైరెక్ట్ అటాక్ చేశారు.
అసలై డైలాగ్ కింగ్.. ఆ తరువాత ఎన్నికల్లో విజయం.. అందుకే మోహన్ బాబు పంచ్ ల మీద పంచ్ లు విసిరారు. కళామ తల్లిని నమ్మిన వ్యక్తే మా అధ్యక్షుడు కావాలని చెప్పానని.. ఇప్పుడు అలాగే జరిగిందన్నారు. తాను అసమర్థుడిని కానని.. మాట్లాడాలనుకుంటే చాలా ఉంటాయన్నారు. తనను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అది మంచిది కాదన్నారు.
అన్నీ నవ్వుతో స్వీకరించాలని చెబుతూనే.. ఎన్నికల్లో జరిగిన తంతుపై ఫైరయ్యారు. చెప్పాల్సిన టైమ్ లో సమాధానం చెప్పాలని చూశానని అంటూనే ఇప్పుడు మొత్తం జవాబిచ్చారు. ఓటు ఎటువేసినా ఇది అందరి విజయం అన్న మోహన్ బాబు.. నోరు ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదన్నారు. తనను మౌనంగా ఉండాలని చెప్పారన్న మోహన్ బాబు.. ఇప్పుడు మాత్రం అన్నీ మాట్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com