VijayaNirmala Birhday Special..విజయనిర్మల జీవితంలో నిజమైన రాజబాబు మాటలు

VijayaNirmala Birhday Special..విజయనిర్మల జీవితంలో నిజమైన రాజబాబు మాటలు
VijayaNirmala బాలనటిగా ప్రవేశించి, హీరోయిన్ గా మారి, దర్శకురాలిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ చూపించారు.

సినిమా పరిశ్రమ పురుషాధిక్య ప్రపంచం. ఇక దర్శక రంగంలో అయితే వారిదే హవా.. వారి హవాకు తొలి నాళ్ల నుంచి కొందరు హీరోయిన్లు అడ్డుకట్ట వేయాలని చూసినా పెద్దగా సాధ్యం కాలేదు. కానీ తను మాత్రం దర్శకురాలిగా అనుకున్నది చేసి చూపించింది.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించింది. ఈ పాటికే ఆమె డైనమిక్ లేడీ విజయనిర్మల అని అర్థమై ఉంటుంది కదూ.. కొన్ని నెలల క్రితమే అనారోగ్యంతో కన్నుమూసిన ఈ అరుదైన నటదర్శకురాలి జయంతి నేడు (20-02-2021).


Vijaya Nirmala.. ఈ పేరు వినగానే చెరగని చిరునవ్వుతో నిండైన రూపం గుర్తొస్తుంది. హీరో కృష్ణ అర్థాంగి అయినా ఆయన విజయంలో సంపూర్ణ భాగస్వామ్యం ఉన్న మహిళ తను. భానుమతి తర్వాత అంత డేరింగ్ హీరోయిన్ అంటే విజయ నిర్మలే అంటారు కొందరు. అది నిజమే అంటాయి ఆమె చేసిన సినిమాలు.. చూపిన ప్రతిభా పాటవాలు.. బాలనటిగా ప్రవేశించి, హీరోయిన్ గా మారి, దర్శకురాలిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ చూపిన విజయ నిర్మల అనే పేరు తెలుగు చిత్రపరిశ్రమలో ఓ ప్రత్యేకమైన అధ్యాయం.


రంగులరాట్నం తర్వాత ఎన్టీఆర్ తో నిండుదంపతులు, అక్కినేనితో బుద్ధిమంతుడు లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె తొలి చిత్రం సాక్షి. ఇదే తర్వాత వారి ప్రేమకు.. ఇన్నేళ్ల వారి వైవాహిక జీవితానికి సాక్ష్యంగా నిలిచింది.. అయితే ఈ ఇద్దరూ దంపతులవుతారని.. సాక్షి షూటింగ్ జరుగుతున్నప్పుడే హాస్యనటుడు రాజబాబు ఊహించి చెప్పారట.


అటు నటిగా, ఇటు దర్శకురాలిగా విజయ నిర్మల ప్రస్థానం అద్భుతంగా కొనసాగింది. దర్శకురాలిగా ఎంతో మంది దర్శకులు చేయలేని సాహసం కూడా చేసింది. అదే దేవదాసును రీమేక్ చేయడం. నాటి దేవదాసు ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అదే చిత్రాన్ని కృష్ణ హీరోగా రూపొందించి మరీ విజయం సాధించింది. అదే విజయనిర్మలలోని ప్రత్యేకత అంటారు.


విజయ నిర్మల డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన కథాంశాలే కనిపిస్తాయి. దీంతో తనపై ఈ ఇమేజ్ ఎక్కువగా పడకుండా ఉండేందుకు కొన్ని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కూడా చేసింది. వాటిలో ప్రధానంగా 'హేమాహేమాలు', 'రామ్ రాబర్ట్ రహీమ్', 'అంతం కాదిది ఆరంభం', 'డాక్టర్ సినీ యాక్టర్'.. ఉన్నాయి.



Tags

Read MoreRead Less
Next Story