Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్-2 గ్రాండ్ ఓపెన్

గత మూడేళ్లుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం ఉత్తేజభరితమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రియాలిటీ షోలతో తన మార్క్ వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‌ను కూడా మన ముందుకు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఇండియన్ ఐడల్-2ను కూడా మొదలు పెట్టింది. ఇందుకు కోసం జనవరి 29న హైదరాబాద్‌లో ఆడిషన్స్‌ను కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూనే.. అంచనాలు పెంచుకుంటోంది.
తాజాగా ఫిబ్రవరి14న తెలుగు ఇండియన్ ఐడల్-2ను బృదం లాంఛనంగా ప్రారంభించింది. ఈ సారీ న్యాయనిర్ణేతలుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ గీతామాధురి, కార్తిక్‌లను నియమించారు. హోస్ట్‌గా మాత్రం హేమచంద్ర వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించి ఆహా సీఈఓ అజిత్ థాకూర్ మాట్లాడుతూ..తెలుగు ఇండియన్ ఐడల్ తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మందిని ప్రభావితం చేసిందన్నారు. 2022లో వచ్చిన మొదటి సీజన్‌కు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారన్నారు. ఆహా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి అలాగే సంగీతంపై మక్కువ ఉన్నవారు వారి ప్రతిభను ఈ షో ద్వారా కనబరుచుకోవడానికి చక్కటి వేదిక అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com