Indian Idol Seson2: ఆడిషన్స్ షురూ..!
హైదరాబాద్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్లో జనవరి 29న ఆడిషన్స్

ఎప్పుడెప్పుడా అని సంగీత ప్రియులు ఎదురు చూస్తున్న సూపర్ హిట్ సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 2 మొదలవుతోంది. ఈ మేరకు ఆడిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్లో జనవరి 29న ఆడిషన్స్ జరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన గళాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఆహా. ఫస్ట్ సీజన్ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా, మరింత వీనులవిందుగా రూపొందుతోంది సెకండ్ చాప్టర్. ఈ విషయాన్ని అన్‌స్టాపబుల్2లో అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ.
ఫస్ట్ సీజన్‌లో తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్, వైష్ణవి తొలి రెండు రన్నరప్ స్థానాల్లో నిలిచారు. మరి ఈ సారి ఇండియన్ ఐడల్ గా మారాలనుకుంటే వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 16 నుంచి 30 ఏళ్ల లోపున్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.