Indian Idol Telugu: పదనిసలే ఆరో ప్రాణం అంటోన్న డాక్టరమ్మ

తెలుగు రాష్ట్రాల్లో సహజసిద్ధమైన టాలెంట్ ను జల్లెడ పడుతున్న ఇండియన్ ఐడల్ కార్యక్రమం సంగీతాన్ని దైవంగా భావించే వారికి అత్యద్భుతమైన వేదికగా మారింది. ఈ కోవలోనే వైద్యరంగంలో సంగీతానికి ఉన్న ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఓ వైద్యురాలు మైక్ పట్టిన విధానం జడ్జిలను సైతం ఆకట్టుకుంది. అమెరికాకు చెందిన శ్రుతి నండూరి స్వతహాగా శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారు. ఎంకి పాటల పట్ల ప్రత్యేక అభిమానాన్ని కనబరిచే శ్రుతి వృత్తిరిత్యా వైద్యురాలు. అయితే వైద్యవృత్తిలో సంగీతానికి ఉన్న హీలింగ్ పవర్ ను కనుగొన్న ఆమె రెండింటి మేళవింపు ద్వారా ప్రపంచలో మార్పు తీసుకురావచ్చని చెబుతున్నారు. మరి తన స్వరాలాపనతో ఇప్పటికే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన శ్రుతి ఇదే రీతిన టైటిల్ కు చేరువ అవుతారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com