ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..

ఎవరా అమ్మాయి.. ఏమా కథ.. ఏంటి విషయం.. సుధీర్ బాబు.. ఏంటి నీక్కూడా ఏమైనా.. ఆగండాగండి.. మీరనుకున్నట్లు అస్సలు కాదు.. ఇంద్రమోహన కృష్ణతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన సుధీర్ బాబు.. ఇప్పుడు మూడో చిత్రం కూడా ఆయన దర్శకత్వంలో చేయానికి రెడీ అయిపోయారు. ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం పేరే ' ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంతకీ ఎవరా అమ్మాయి.. ఏం చెప్తారో చూద్దాం.
ఇప్పటికే సమ్మోహనం, వి .. ఈ రెండు చిత్రాలు వీరిద్దరి కలయిలో వచ్చాయి. ముచ్చటగా ఇది మూడో చిత్రం. ఈ చిత్రాన్ని బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు సమర్పిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే టైటిల్స్ పెట్టే ఇంద్రగంటి ఈ సారి మరింత వినూత్నమైన టైటిల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టికి ఛాన్స్ వచ్చింది. సుధీర్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com