Balakrishna : ఒక్క ఫైటు లేదు.. ఒక్క స్టెప్పు లేదు.. అయిన బ్లాక్‌‌బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య..!

Balakrishna : ఒక్క ఫైటు లేదు.. ఒక్క స్టెప్పు లేదు.. అయిన బ్లాక్‌‌బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య..!
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆ సినిమా నుంచి యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగులు, పాటలు, ఆ పాటలకి బాలయ్య అదిరిపోయే స్టెప్పులు ఉండాలని వారు అనుకుంటారు.

ఆ విధంగానే దర్శకనిర్మాతలు కూడా ఆయనతో సినిమాలని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒక్క ఫైటు లేకుండా, ఒక్క స్టెప్పు లేకుండా బ్లాక్‌‌బస్టర్ హిట్‌‌ను కొట్టి బాక్స్ ఆఫీస్‌‌ని షేక్ చేశారు బాలయ్య.. అదే 'నారినారి నడుమ మురారి'.

అయితే ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణాలు మెయిన్‌‌గా రెండే రెండు... ఒకటి బాలయ్య నటన కాగా, రెండోది కథ... అత్తాఅల్లుళ్ళ టీజింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాకి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. యువచిత్ర పతాకం పై నిర్మాత మురారి ఈ సినిమాని తెరకెక్కించారు. బాలయ్యతో ఆయనకిది రెండో సినిమా.. దీనికి ముందు వీరి కాంబినేషన్‌లో సీతారామ కళ్యాణం అనే చిత్రం వచ్చింది.

ఇక నారినారి నడుమ మురారి చిత్రానికి కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథా రచయితలు కావడం విశేషం. ఇందులో బాలకృష్ణ సరసన శోభన, నిరోషా హీరోయిన్స్‌‌గా నటించారు.. వీరికంటే ముందుగా భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, సీతను హీరోయిన్లుగా అనుకున్నారు.

ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్‌‌లో చిత్రీకరించారు. సినిమా పతాక సన్నివేశాలలో హీరో బాలయ్య దాదాపుగా 22 నిమిషాలు కనిపించకపోవడం విషేశం. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామికి దర్శకుడు, నటుడు జంధ్యాల డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. ఈ సినిమా 1990 ఏప్రిల్ 27న విడుదలై సూపర్ సక్సెస్ అయింది.

ఆ ఏడాదే సంక్రాంతికి బాలయ్య నటించిన ప్రాణానికి ప్రాణం చిత్రం విడుదలై ప్లాపై అభిమానులకు కాస్త నిరాశని మిగిల్చగా, నారినారి నడుమ మురారి చిత్రం అభిమానులను ఉత్సాహపరిచింది. సినిమా వచ్చి మూడు దశాబ్దాలు గడిచిన ఇప్పటికీ టీవీలో వస్తే అత్తుకుపోయి మరి చూస్తుంటారు ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story