స్నేహను అనుకొని సిమ్రాన్‌‌ని తీసుకొని జ్యోతికతో ఫినిష్ చేశారు..!

స్నేహను అనుకొని సిమ్రాన్‌‌ని తీసుకొని జ్యోతికతో ఫినిష్ చేశారు..!
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి.. ఒక సినిమాని ఒకరితో అనుకోని మరొకరితో చేస్తుంటారు. కొన్ని సార్లు కథ నచ్చాకో లేకా డేట్స్ కుదరకో హీరోహీరోయిన్స్ ఆ సినిమాలను వదులుకుంటారు.

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి.. ఒక సినిమాని ఒకరితో అనుకోని మరొకరితో చేస్తుంటారు. కొన్ని సార్లు కథ నచ్చాకో లేకా డేట్స్ కుదరకో హీరోహీరోయిన్స్ ఆ సినిమాలను వదులుకుంటారు.. రజినీకాంత్ 'చంద్రముఖి' సినిమా విషయంలో కూడా అదే జరిగింది. 'మనిచిత్రతాయు' మలయాళ సినిమాకి రీమేక్‌‌గా చంద్రముఖి తెరకెక్కింది. మనిచిత్రతాయు సినిమాని ముందుగా కన్నడలో ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేశారు. దీనికి పి.వాసు దర్శకుడు. విష్ణువర్ధన్ హీరో, సౌందర్య హీరోయిన్ నటించారు.

ఈ సినిమాను కన్నడలో చూసిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య చిరంజీవితో రీమేక్ చేయాలని అనుకున్నారు.. కానీ చిరంజీవి అంతగా పట్టించుకోకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇదే సినిమాని థియేటర్‌‌కి మారువేషంలో వెళ్లి చూసిన రజినీ.. ఫ్లాట్ అయిపోయి వెంటనే తమిళ్, తెలుగు బాషల్లో రీమేక్ చేయాలని అనుకున్నారు. దీనికి ముందు తమిళంలో ఈ సినిమాని ప్రభు గణేశన్‌‌తో చేయాలనుకున్నారు పి వాసు. కానీ రజనీనే చేస్తాననీ అనడంతో ప్రభు మరో రోల్ చేశారు. శివాజీ ప్రొడక్షన్‌‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇది వారికి 50వ సినిమా కావడం విశేషం.

అయితే ఈ సినిమాకి ముందుగా స్నేహాని హీరోయిన్‌‌గా అనుకున్నారు. కానీ సిమ్రాన్‌‌ని తీసుకున్నారు. ఆమె రెండు రోజులపాటు షూటింగ్‌‌లో కూడా పాల్గొంది.. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో సదా, రీమాసేన్‌‌ని సంప్రదించి చివరికి జ్యోతికను తీసుకున్నారు.. రజినీ పక్కన హీరోయిన్‌‌గా దుర్గ పాత్రకి నయనతారను తీసుకున్నారు. ఇక ఈ సినిమారు ముందుగా అనుకున్న టైటిల్ నాగవల్లి.. ఆ తర్వాత చంద్రముఖిగా మార్చారు.. రజినీకాంత్ ఇమేజ్‌‌ని పక్కన పెట్టి.. కథను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ టైటిల్‌‌ని పెట్టారు. రజినీ‌‌కి స్టార్ డం వచ్చిన తర్వాత ఇలా టైటిల్ పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం

ఈ సినిమాలో లక లక అనే డైలాగ్ రజినీ పెట్టిందే.. మరాఠీ భాషలో నాటకాలు వేస్తున్న టైంలో రజినీ ఈ డైలాగ్‌‌ను వాడారట. కాగా మొత్తం ఎనిమిది కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. రజినీకాంత్ రెమ్యునరేషన్ 15 కోట్లు తీసుకున్నారు. ఓ రీమేక్ సినిమాకి తమిళనాడు గవర్నమెంట్ స్టేట్ అవార్డు ఇవ్వడం ఈ సినిమాకే మొదటిసారి. జర్మనీలో రిలీజ్ అయిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇకల తమిళనాడు లోని శాంతి థియేటర్లో ఈ సినిమా ఏకంగా 890 రోజులు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించింది.

Tags

Read MoreRead Less
Next Story