'అరె ఓ సాంబ' .. నాగబాబు కోసం కథ రాస్తే చిరు చేసేశారు.. !

అరె ఓ సాంబ .. నాగబాబు కోసం కథ రాస్తే చిరు చేసేశారు.. !
చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను అంటూ ఇందులో చిరు చెప్పే డైలాగ్ ఇప్పటికి ఫేమస్ అనే చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవిని మాస్ హీరోగా మరో స్థాయికి చేర్చిన సినిమా గ్యాంగ్‌‌లీడర్.. చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను అంటూ ఇందులో చిరు చెప్పే డైలాగ్ ఇప్పటికి ఫేమస్ అనే చెప్పాలి. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్‌‌గా నటించింది. చిరు యాక్టింగ్, డాన్స్, బప్పిలహరి సాంగ్స్, విజయశాంతి గ్లామర్ సినిమా సక్సెస్‌‌లో కీరోల్ పోషించాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమాల్లో చిరు వేసుకున్న షర్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి. గ్యాంగ్‌‌లీడర్ షర్ట్స్ పేరుతో మార్కెట్‌‌లో అమ్మారు.

అయితే ముందుగా ఈ సినిమాని చిరంజీవి తమ్ముడు నాగబాబుతో చేయాలని అనుకున్నారు విజయ బాపినీడు. అయితే అది ఫ్యామిలీ డ్రామా.. ఒకప్పుడు తాను తీసిన 'బొమ్మరిల్లు' ('78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. 'షోలే' సినిమాలోని అమ్జాద్‌ ఖాన్‌ డైలాగ్‌ ప్రేరణతో 'అరె ఓ సాంబా' అని టైటిల్‌ పెట్టాలనుకున్నారు. అయితే అదే సమయంలో చిరంజీవి నుంచి సినిమా చేద్దామని పిలుపు రావడంతో ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్‌ జోడించి గ్యాంగ్‌‌లీడర్ పేరుతో సినిమా తీశారు. సినిమా సూపర్ డూపర్ హిటై మాస్ హీరోగా చిరంజీవికి ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది.

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ ఫ్లైట్‌ ఆసరాగా ఏకంగా నాలుగు చోట్లల్లో(తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయవాడ) శతదినోత్సవ ఉత్సవాలను జరిపారు. ఇదే సినిమాని తమిళ్‌‌లో డబ్ చేయగా అక్కడ సూపర్ హిట్ అయింది. అక్కడ చిరుకి సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. ఇక హిందీలో రవిరాజా పినిశెట్టి ఈ సినిమాని రీమేక్ చేయగా అక్కడ కూడా చిరునే నటించారు. హీరోయిన్‌‌గా మీనాక్షి శేషాద్రి నటించింది. హిందీ రీమేక్‌‌లో చిరంజీవి ఫ్రెండ్ పాత్రను రవితేజ చేయడం విశేషం. అక్కడ కూడా ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది.

హిందీలో చిరంజీవికి ఇది రెండో విజయం.. అంతకుముందు 'ప్రతిబంధ్‌' (తెలుగు 'అంకుశం'కి రీమేక్‌) మొదటి విజయం.. ఈ సినిమాకి కూడా రవిరాజా పినిశెట్టి దర్శకుడు కావడం విశేషం. ఇక గ్యాంగ్‌‌లీడర్ చిత్రం తర్వాత చిరు,విజయశాంతి కలిసి మళ్ళీ నటించలేదు.

Tags

Read MoreRead Less
Next Story