'అమ్మోరు' చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడెలా ఉంది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

అమ్మోరు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడెలా ఉంది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ లుగా ఎదిగారు. అందులో రాశి, శ్రీదేవి, మీనా లాంటి వాళ్ళు ఉన్నారు.

ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ లుగా ఎదిగారు. అందులో రాశి, శ్రీదేవి, మీనా లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే చైల్డ్ అరిస్ట్ గా వచ్చిన ప్రతి వారు హీరోయిన్ లు ఎదుగుతరన్న గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ సునైనా బాదం. సునైనా బాదం అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ అమ్మోరు సినిమాలో చైల్డ్ అరిస్ట్ అంటే టక్కున గుర్తుకువస్తుంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెద్ద పెద్ద కళ్లతో గంభీరంగా కనిపించి మెప్పించింది సునైనా బాదం. కానీ ఆ తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సునైనా షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆమె చేసిన '​ఫ్రస్టేటెడ్‌ ఉమెన్‌'అనే షార్ట్‌ ఫిలిమ్ బాగా ఫేమస్ అయింది. అయితే తనకి హీరోయిన్ కావాలని పెద్దగా ఆశ లేదు కానీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలని మాత్రం ఉంది అని సునైనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.Tags

Read MoreRead Less
Next Story