ఆర్యన్ రాజేష్ వైఫ్ సుభాషిణి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు చిత్రపరిశ్రమలో హాస్య, కుటుంబ కధాచిత్రాలను తెరకెక్కించడంలో తమకి తామే సాటి అనే చెప్పుపునే అతికొద్దిమంది దర్శకులలో ఈవివి సత్యనారాయణ ఒకరు. జంధ్యాల శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఎక్కువగా హాస్యప్రధానమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన వారసులుగా రాజేష్, నరేష్ హీరోలుగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో నరేష్ హీరోగా బాగా క్లిక్ అవ్వగా, రాజేష్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఆర్యన్ రాజేష్ వివాహం చాలా విషాదకరమైన పరిస్థితిలో జరిగింది.
2012 ఫిబ్రవరి 11న ఆర్యన్ రాజేష్ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు సుభాషిణి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం. 2011లో ఈవివి.. తన స్నేహితుడి కూతురైన సుభాషిణి ఫోటోను ఆర్యన్ రాజేష్‌కి పంపి పెళ్లి చేసుకోవాలని చెప్పారట. ఫోటోలో సుభాషిణి అంతగా నచ్చకపోవడంతో రాజేష్ ముందుగా రిజెక్ట్ చేశారట.. ఆ తర్వాత డైరెక్ట్‌గా వెళ్లి సుభాషిణిని చూసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వీరి పెళ్లిచూపులు 2011 జనవరి 5 న జరగగా, జనవరి 11న ఈవివి మరణించారు.
ఆ సమయంలో సుభాషిణి కుటుంబం ఈవివి కుటుంబానికి అండగా నిలిచారట. పెళ్ళికి ముందే తమతో కలిసిపోయి సుభాషిణి తమ కష్టాలలో పాలు పంచుకుందని రాజేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏడాది తర్వాత అంటే 2012 ఫిబ్రవరి 11న రాజేష్, సుభాషిణి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2012 డిసెంబర్ 1న ఓ కుమారుడు జన్మించాడు. దీనితో ఈవివి మళ్ళీ పుట్టారని రాజేష్ కుటుంబమంతా అనుకున్నారు. కాగా అటు నరేష్ చెన్నైకి చెందిన విరూప అనే అమ్మాయిని 2015 మే29న వివాహం చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com