"రామారావు"గా ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలో ఇవి గమనించారా?

రామారావుగా ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలో ఇవి గమనించారా?
మీలో ఎవరు కోటీశ్వరుడు.. బుల్లితెర పైన బాగా క్లిక్ అయిన షో... స్టార్ మా ఛానల్‌లో సక్సెస్ఫుల్ గా నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీలో ఎవరు కోటీశ్వరుడు.. బుల్లితెర పైన బాగా క్లిక్ అయిన షో... స్టార్ మా ఛానల్‌లో సక్సెస్ఫుల్ గా నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో కాకుండా "ఎవరు మీలో కోటీశ్వరులు" పేరుతో వస్తుంది. తాజాగా షోకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు నిర్వాహకులు...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రోమోలో ఎన్టీఆర్ కోరమీసంతో చాలా స్టైలిష్‌గా కనిపించారు. 'ఈ ఆట గురించి నా కంటే మీకే బాగా తెలుసు' అంటూ తనదైన మాటతీరుతో ఆకట్టుకున్నారు. 'ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది.. ఇక్కడినుంచి ఎంత పట్టుకెళ్తారో నేను చెప్పలేను.. కానీ లైఫ్‌లో నేను గెలవగలను అనే కాన్ఫిడెన్స్ ని మాత్రం కచ్చితంగా పట్టుకెళ్తారు.. నాది గ్యారెంటీ" అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ తో షో పైన ఆసక్తిని పెంచేశాడు.

ఇక ప్రోమో చివర్లో .. 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.. ఇట్లు ప్రేమతో మీ రామారావు' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులను హుషారెత్తించింది.

అయితే ఈ ప్రోమోలో ఈ విషయాలను ఒక్కసారి గమనిస్తే..

1. షో పేరు మారింది... "మీలో ఎవరు కోటీశ్వరుడు" కాస్తా... "ఎవరు మీలో కోటీశ్వరులు"గా మారింది.

2. గతంలో హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున, చిరంజీవిలను కాకుండా ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ షోను హోస్ట్ చేస్తున్నారు.

3. వేదిక కూడా మారింది.. గతంలో స్టార్ మాలో ప్రసారం అయిన ఈ షో.. ఇప్పుడు జెమినిలో ప్రసారం కానుంది.

4. ఎప్పుడు రామారావుగా తనని తానూ ఎప్పుడు కూడా పిలుచుకొని ఎన్టీఆర్.. ప్రోమో చివర్లో మీ రామారావు అంటూ ఫినిషింగ్ ఇచ్చాడు.

5. అక్కినేని నాగార్జున, చిరంజీవి కంటే ఎన్టీఆర్ హోస్ట్ అనగానే షో పైన అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి.

షో మొదలయ్యాక ఇంకేమైనా చేంజ్ అవుతాయా? లేదా ? అన్నది చూడాలి మరి.. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటివారంలో షో మొదలుకానుంది.


Tags

Read MoreRead Less
Next Story