వంటలక్క అత్త గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

వంటలక్క అత్త గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ సీరియల్‌‌‌‌ను బీట్ చేయలేకపోతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సీరియల్ కి వస్తున్న ఆదరణ ఏంటో..

రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకి కార్తీక దీపం సీరియల్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.. ఈ సీరియల్ వచ్చే సమయానికి చిన్న,పెద్ద, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు టీవీలకి హత్తుకుపోతారు. అందుకే ఈ సీరియల్ మొదలై మూడు సంవత్సరాలు అవుతున్న.. ఇంకా టాప్ రెంటింగ్ లోనే దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ సీరియల్‌‌‌‌ను బీట్ చేయలేకపోతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సీరియల్ కి వస్తున్న ఆదరణ ఏంటో..

అయితే ఈ సీరియల్ ద్వారా చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు బుల్లితెరకి పరిచయయ్యారు. అందులో ఒకరు అర్చన అనంత్.. ఈ సీరియల్‌‌‌‌లో ‌ఆమె సౌందర్య అనే పాత్రలో నటిస్తున్నారు. పవర్ లేడిగా మంచి అత్తగా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పాత్రలో ఆమె పలికించే భావోద్వేగాలకు ఎవరైనా దాసోహం కావాల్సిందే. అయితే ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.


♦ అర్చన సొంత రాష్ట్రం కర్ణాటక.. ఆమె బెంగళూరులో జన్మించారు.

♦ ఈ సీరియల్‌లో ఆమె అత్త పాత్రలో నటిస్తున్నారు కానీ ఆమె వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే..

♦ నటిగా కంటే ముందు ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఆమె కన్నడలో పనిచేశారు. ఆ తరవాత ఓ షార్ట్ ఫిలింలో చిన్నపాత్ర కోసం ఆమె సహచరులు అడిగితే చేశారట..

♦ ఆ పాత్ర కూడా మరెంటో కాదు.. ఓ శవంలా పడుకోవడం.. నో డైలాగ్స్‌... నో ఎక్స్‌ప్రెషన్స్‌.

♦ అర్చన కుటుంబం కూడా సినీ కుటుంబమే.. ఆమె నాన్న గారు అనంత వేలు.. కన్నడలో పలు సినిమాలలో నటించారు. ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగి..


♦ కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగులోకి వచ్చారు అర్చన... ఇప్పుడు తెలుగులో కూడా బిజీనే అయ్యారు అర్చన..

♦ నటి కాకముందు ఆమె కకొద్దిగా బొద్దుగానే ఉండేవారట. అయితే కార్తీక దీపం సీరియల్ మొదలయ్యాక కాస్తా బరువును తగ్గారట..

♦ అర్చనకు అనంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అనంత్ ఓ బిజినెస్‌మ్యాన్ కావడం విశేషం.. ఈ దంపతులకి ఓ కుమారుడు ఉన్నాడు.

♦అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ 'కేరాఫ్‌ అనసూయ'లో కూడా నటిస్తోంది.

♦ ఇక సినిమాల్లో అయితే ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీర్‌గా, దాసీ క్యారెక్టర్‌లో నటించాలని ఉందట.. మంచి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి సిద్దమేనని అంటుంది అర్చన..Tags

Read MoreRead Less
Next Story