నారప్ప చిన్న కొడుకు సీనప్ప గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

నారప్ప చిన్న కొడుకు సీనప్ప గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
విక్టరీ వెంకటేష్ మెయిన్ లీడ్ లో నటించిన తాజా చిత్రం నారప్ప.. వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది.

విక్టరీ వెంకటేష్ మెయిన్ లీడ్ లో నటించిన తాజా చిత్రం నారప్ప.. వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వెంకటేష్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే నారప్ప చిన్నకొడుకుగా సీనప్ప అదరగొట్టాడు. తన కళ్ళముందే తన అన్నని చంపిన వాళ్ళ పై ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో ఒదిగిపోయాడు.

సీనప్ప అసలు పేరు గీతా కృష్ణ.. ముద్దుగా రాఖీ అని పిలుస్తుంటారు. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. తన అన్నయ్య వల్ల ఈ సినిమాలో అవకాశం వచ్చిందని తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమా కంటే ముందు రంగస్థలం అనే సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినట్టుగా వెల్లడించాడు. అయితే మరికొన్ని సినిమాల్లో ఎడిటింగ్ లో తన సన్నివేశాలను కట్ చేసినట్టుగా వెల్లడించాడు. నారప్ప సినిమాల్లో నటించడానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, హీరో వెంకటేష్ బాగా సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో వెంకటేష్ నటన చూసి కన్నీళ్ళు వచ్చాయని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో మరిన్ని మంచి పాత్రలు పోషించాలని ఉందని చెప్పుకొచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story