టాలీవుడ్

ఈ వెంకటేష్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందంటే?

ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే రాణించడం మాత్రం చాలా కష్టం.. అలాంటి కోవాలోకే వస్తుంది నటి ఆషా సైని..

ఈ వెంకటేష్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందంటే?
X

ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే రాణించడం మాత్రం చాలా కష్టం.. అలాంటి కోవాలోకే వస్తుంది నటి ఆషా సైని.. ఆషా సైని అంటే టక్కున గుర్తుపట్టలేకపోవచ్చు. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశా అంటే టక్కున గుర్తుకువస్తుంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె అసలు పేరు ఫ్లోరా. పుట్టింది చండీఘర్‌‌లో.. వాళ్ళ నాన్న ఓ ఆర్మీ అధికారి.

ఆమె జమ్మూకాశ్మీర్ లోని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువయ్యాక మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 1999లో వచ్చిన 'ప్రేమకోసం' అనే సినిమాతో టాలీవుడ్‌‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, చాలా బాగుంది, మనసున్న మారాజు, సర్దుకుపోదాం రండి, ఓ చినదానా లాంటి సినిమాలలో ఆమె నటించింది. స్టార్ హీరోలతో, బ్లాక్ బస్టర్ లాంటి సినిమాలలో ఆమె నటించినప్పటికీ ఆమెకి అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు.


ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న ఈ భామ ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది. ఇదిలావుండగా ఆమెను 2008లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసా కలిగి ఉన్నదనే నేరం మీద ఆమెను అరెస్టు చేశారు. దాంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది. కానీ ఆ తర్వాత ఆమె నిర్దోషి అని రెండు వారాల తర్వాత తేలింది. ఒకసారి హీరోయిన్ మీద ఇలాంటి వార్తలు వస్తే మేకర్స్ అవకాశాలివ్వడానికి ధైర్యం చేయరు. అలా ఆషా సైనికి అవకాశాలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చు.

Next Story

RELATED STORIES