'అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు'..Anasuya Tweet Viral

అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు..Anasuya Tweet Viral
X
Anasuya Bharadwaj.. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఏ విషయమైనా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది. అనసూయ ట్వీట్‌కు హీరో రీప్లై ఇచ్చారు.

Anasuya Bharadwaj.. బుల్లితెర మీద అందాల యాంకర్‌గా ఎన్ని వగలు పోయినా.. రొమాంటిక్ స్టెప్పులతో కనివిందు చేసినా.. వెండి తెర మీద ఏదైనా పాత్రకు అవకాశం వచ్చిందంటే దటీజ్ అనసూయ అనిపించుకుంటుంది ఈ జబర్థస్త్ బ్యూటీ.


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తు ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఏ విషయమైనా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ట్వీట్ చేసింది అనసూయ.



"అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు" అని ట్వీట్ చేసింది. ఈ క్యాప్షన్‌తో పాటు #Coming soon అంటూ తను నటిస్తున్న 'చావు కబురు చల్లగా' మూవీలోని లుక్‌ను షేర్ చేసింది.


అనసూయ ట్వీట్‌కు (Anasuya Tweet) హీరో కార్తికేయ రీప్లై ఇచ్చారు. 'మీ ప్రజేన్స్‌తో మా మూవీను మరింత ప్రత్యేకం చేసినందుకు ధన్యవాదాలు అనసూయ గారు.. ఈ స్పెషల్‌ సాంగ్‌ చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడండి' అంటూ​ హీరో కార్తికేయ ట్వీట్‌ చేశాడు.


కాగా 'చావు కబురు చల్లగా' మూవీలో అనసూయ ఓ ఐటమ్ సాంగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తికేయకు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.





Tags

Next Story