మొన్న సుధీర్.. నేడు రష్మీ.. నిజమెంత!!

మొన్న సుధీర్.. నేడు రష్మీ.. నిజమెంత!!
మొన్నటికి మొన్న జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్

కరోనా రావడం కామన్ అయిపోయింది.. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించడం మానేసి తమ పనుల్లో తాము మునిగిపోతున్నారు దాదాపుగా అందరు. అయితే కరోనా సోకిన విషయం సెలబ్రెటీలు అధికారికంగా ప్రకటించకపోతే అభిమానులు ఆందోళనకు గురవుతారు.. మొన్నటికి మొన్న జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారని వార్తలు షికారు చేశాయి. అయితే ఆ విషయంపై సుధీర్ టీమ్ స్పందించకపోవడంతో నిజంగానే అతడికి కరోనా వచ్చిందని ఫిక్సయిపోయారంతా.. మళ్లీ ఇప్పుడు అతడి జోడీ రష్మీ గౌతమ్ కూడా కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రష్మీకి ఇటీవల స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారని రిపోర్టులో పాజిటివ్ అని తేలిందని సమాచారం. దీంతో ఆమె షూటింగ్స్ అన్నింటికీ దూరంగా ఉంటోందని తెలిసింది. ఈ కారణంగానే అక్టోబర్ 23, 28 తేదీల్లో జరిగే షూటింగ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసినట్లు జబర్ధస్త్ యూనిట్ పేర్కొనడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. రష్మీ తనకు కరోనా సోకిందని అధకిరాకంగా ప్రకటించకపోవడంతో ఈ విషయం చర్చకు దారితీసింది.

మరోవైపు రష్మీ, నందు ప్రధాన పాత్రల్లో వస్తున్న 'బొమ్మ బ్లాక్ బస్టర్' చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కరోనా కారణంగా మూవీ ప్రమోషన్ ని పక్కన పెట్టి రష్మీ హోం క్వారంటైన్ లో ఉందని తాజా సమాచారం. మరి ఈ వార్తలపై రష్మి స్పందించాల్సి ఉంది.

Tags

Next Story