Hyper Aadi : స్కిట్‌కి లక్ష... హైపర్ ఆది ఏడాది సంపాదన ఎంతంటే ?

Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ లో అతను వేసే పంచులకి భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మనోడి స్కిట్లు యూట్యూబ్‌లో ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటాయి. జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటాడు.
దీనితో హైపర్ ఆదికి మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే అతనికి అంతే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా ఉంటుందని టాక్... ఈవెంట్‌ను బట్టి హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని సమాచారం. ఇక జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది.
దీనిని బట్టి చూస్తే అతన్ని ఏడాది ఆదాయం కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.. ఇక బుల్లితెరతో పాటుగా సినిమాల్లో కూడా మెరుస్తూ అలరిస్తున్నాడు ఆది. కామెడీ షోలతో పాటుగా, సినిమాలతో కలిపి బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సొంత ఊర్లో 16 ఎకరాలు కొన్న ఆది.. హైదరాబాదులో తాజాగా ఓ ప్లాట్ తీసుకున్నట్టుగా సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com