Adhire Abhi: షూటింగ్‌లో అదిరే అభికి గాయాలు.. చేతికి 15 కుట్లు..

Adhire Abhi: జబర్దస్త్ అనే ఒక కామెడీ షో.. స్టాండప్ కామెడీ షోల ఫేమ్‌నే మార్చేసింది. ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పటికీ ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారానే ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో ఒకరు అదిరే అభి. ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తున్నా అభికి ఎక్కువ ఫేమ్ తీసుకొచ్చింది ఈ షోనే. తాజాగా అభి గురించి ఓ వార్త వైరల్‌గా మారింది.
అదిరే అభి.. కమెడియన్‌గా మాత్రమే కాదు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పలు సినిమాలకు పనిచేశాడు. ఓవైపు జబర్దస్త్‌లో చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా రోల్స్ చేశాడు. అయితే తనకు హీరోగా కూడా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దీంతో జబర్దస్త్‌కు దూరమయ్యి పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టాడు. తాజాగా తాను నటిస్తున్న సినిమా షూటింగ్ స్పాట్‌లో అభికి ప్రమాదం జరిగింది.
అభి హీరోగా నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం తనపై ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిందని, చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. దీని వల్ల తన చేతికి 15 కుట్లు కూడా పడ్డాయట. దీంతో డాక్టర్ తనను కొన్నిరోజులు షూటింగ్స్‌కు దూరంగా విశ్రాంతి తీసుకోమన్నట్టు ఫిల్మ్ సర్కి్ల్లో అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com