Patas Praveen: జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం..

Patas Praveen: బజర్దస్త్ అనేది ఎంతోమంది కనుమరుగయిపోయిన వారికి, అప్‌కమింగ్ కమెడియన్లకు ఛాన్స్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు పటాస్ ప్రవీణ్. ముందుగా పటాస్ అనే స్టాండప్ కామెడీ షోతో పరిచయమయిన ప్రవీణ్.. తన ఐడెంటిటీనే పటాస్ ప్రవీణ్‌గా మార్చుకున్నాడు. ఇటీవల ఈ కమెడియన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పటాస్ ప్రవీణ్ తండ్రి గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. అంతే కాకుండా కొన్నాళ్ల క్రితం ఆయనకు వెన్నపూసలో నీరు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. దానికి ఆయనకు సర్జరీ కూడా జరిగింది. కానీ ఆ సర్జరీ అనుకున్నట్టు జరగకపోవడంతో కాళ్లు, చేతులు పడిపోయాయి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ తిన్నదని వైద్యులు వెల్లడించారు. ఇక తాజాగా ప్రవీణ్ తండ్రి కన్నుమూశారు.
ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే చనిపోయిందని ఇప్పటికే తను ఎన్నోసార్లు షోలోనే వెల్లడించాడు. అయినా కూడా ప్రవీణ్ తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా ప్రవీణ్‌ను, తన అన్నను పెంచి పెద్ద చేశారు. ఇక ఇలాంటి సమయంలో తన తండ్రిని కూడా కోల్పోవడంతో ప్రవీణ్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రేక్షకులతో పాటు సహ నటీనటులు కూడా కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com