Varsha Jabardasth: చావు, బ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..

Varsha Jabardasth: వెండితెర సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ఈమధ్య బుల్లితెర సెలబ్రిటీలు కూడా తెగ ఫేమస్ అయిపోతున్నారు. ముఖ్యంగా రియాలిటీ షోలు అనేవి ఆర్టిస్టులుగా చాలామందికి లైఫ్ ఇస్తున్నాయి. అలా జబర్దస్త్ అనే రియాలిటీ షో చాలామందిని ఆర్టిస్టులుగా నిలబెట్టింది. అందులో ఒకరే వర్ష. ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల ఫేమస్ అయిన వర్ష.. చావు, బ్రతుకుల మధ్య ఉందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది.
కొన్ని రియాలిటీ షోలలో జరిగే ఫేక్ పెళ్లిల ద్వారా కొందరు ఆర్టిస్టులు ఫేమస్ అవ్వడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అలాగే వర్ష కూడా ఇమాన్యూయేల్‌తో నడిపిన లవ్ ట్రాక్, వీరిద్దరి మధ్య జరిగిన రీల్ పెళ్లి వల్ల ఫేమస్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్‌తో ఫాలోయింగ్ పెంచుకుంది. దీంతో తనపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఫోకస్ పెట్టాయి.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఇప్పటికీ ఫేక్ థంబ్‌నెయిల్స్‌తో వ్యూస్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అలాంటి వారికి వర్ష టార్గెట్‌గా మారింది. ఇప్పటికీ తనపై ఎన్నో ఫేక్ న్యూస్‌లు వచ్చాయి. ఓసారి తను బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వచ్చాయి. దీనికి తాను జబర్దస్త్ వదిలి వెళ్లిపోతానని స్టేజ్‌పైనే ఏడ్చేసింది. కానీ మళ్లీ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరో థంబ్‌నెయిల్‌లో వర్ష చావు, బ్రతుకుల మధ్య ఉందని వార్త రాగా.. అది ఫేక్ అని, తను బాగానే ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది వర్ష.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com