మరోసారి పోలీస్ స్టేషన్‌కి జబర్ధస్త్ వినోద్.. ఇంకా తేలని రూ.40 లక్షల మ్యాటర్..!
జబర్దస్త్ షో ద్వారా చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు వెలుగులోకి వచ్చారు.అందులో వినోద్ ఒకరు... వినోద్ ఎక్కువగా మహిళ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు.
BY prasanna8 April 2021 12:27 PM GMT

X
prasanna8 April 2021 12:27 PM GMT
జబర్దస్త్ షో ద్వారా చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు వెలుగులోకి వచ్చారు.అందులో వినోద్ ఒకరు... వినోద్ ఎక్కువగా మహిళ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే వినోద్ తనకు న్యాయం చేయాలంటూ ఈరోజు హైదరాబాద్ ఈస్ట్ జోన్ DCP రమేష్ రెడ్డిని కలిశాడు. తాను ప్రస్తుతం అద్దెకుంటున్న ఇంటిని యజమాని గతంలో ₹40లక్షలకు విక్రయిస్తానని చెప్పాడని ఇందుకు తాను రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా ఇచ్చానని తెలిపాడు.
అయితే ప్రస్తుతం ఎక్కువ డబ్బు ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేకపోతే అడ్వాన్సు కూడా వెనక్కి ఇవ్వనని బెదిరిస్తున్నాడని, గతంలో ఓ సారి భౌతిక దాడి కూడా చేశారని ఫిర్యాదు చేశాడు. ఈ దాడిపై ఫిర్యాదు చేసినా కాచిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడైనా న్యాయం జరిగేలా చూడాలని డీసీపీకి వినతిపత్రం అందించాడు వినోద్.
Next Story