ట్రెండింగ్‌లో ఉప్పెన సాంగ్.. !

ట్రెండింగ్‌లో ఉప్పెన సాంగ్.. !
ఈ మధ్య సినిమాలకి పాటలతోనే పెద్ద హైప్ క్రియేట్ అవుతంది. పాటలు ఎంత హిట్టయితే సినిమాకి అంత ప్లస్ అవుతుంది.

ఈ మధ్య సినిమాలకి పాటలతోనే పెద్ద హైప్ క్రియేట్ అవుతంది. పాటలు ఎంత హిట్టయితే సినిమాకి అంత ప్లస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే కేవలం పాటల కోసమే సినిమాకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదిలావుండగా.. నిన్న (గురువారం) సాయంత్రం 'ఉప్పెన' సినిమా నుంచి జలజలజలపాతం నువ్వే.. అనే వీడియో సాంగ్‌ను యూట్యుబ్ లో రిలీజ్‌ చేశారు మేకర్స్... 39 లక్షల పై చిలుకు వ్యూస్‌తో ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్‌ కలిసి ఆలపించారు. కాగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కెన ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి హీరోహేరోయిన్లుగా నటించారు. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న సినిమా విడుదల అయింది.


Tags

Next Story