Janhvi Kapoor : తెలుగు సూపర్ స్టార్ తో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ..!

Janhvi Kapoor : తెలుగు సూపర్ స్టార్ తో జాన్వీ కపూర్ టాలీవుడ్  ఎంట్రీ ..!
Janhvi Kapoor : గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం తన సర్కారీ వారి పాట అనే సినిమాను చేస్తున్నాడు..

Janhvi Kapoor : గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం తన సర్కారీ వారి పాట అనే సినిమాను చేస్తున్నాడు.. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కి షిఫ్ట్ కానున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన త్రివిక్రమ్.

ప్రస్తుతం నటీనటుల ఎంపికలో పడ్డాడు. అందులో భాగంగానే మహేష్ సరసన ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేను కన్ఫామ్ చేసిన త్రివిక్రమ్... మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామ.. జాన్వీ కపూర్ ని తీసుకోవాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది.. ఇప్పటికే జాన్వీ కపూర్ కి కథను వినిపించారని, ఆమె కూడా సినిమాని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో నైనా జాన్వికపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. అతడు,ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది.

Tags

Read MoreRead Less
Next Story