బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు..!

వెండితెర పైన బాహుబలి సినిమా సృష్టించిన రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆలాంటి బాహుబలి సినిమాని ఓ చిన్న సినిమా బీట్ చేస్తే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఆలోచించండి.. అవును... ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో జాతిరత్నాలు మూడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో 'బాహుబలి: ది కంక్లూజన్' వసూళ్లను ఈ సినిమా అధిగమించింది.
'బాహుబలి ది కంక్లూజన్' సినిమా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల గ్రాస్ ను వసూలు చేసింది. దీనితో అప్పటివరకు ఉన్న పాత రికార్డులన్నీ చెరిపేసినట్టైంది. అయితే ఈ రికార్డును అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు అధిగమించాయి. అల వైకుంఠపురములో 40.83 లక్షల గ్రాస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సరిలేరు నీకెవ్వరు దానికి చేరువగా వచ్చి తృటిలో మొదటి స్థానాన్ని చేజార్చుకొని రెండో స్థానంలో ఉంది.
కాగా ప్రస్తుతం దేవి థియేటర్లో ఆడుతున్న 'జాతిరత్నాలు' సినిమా మొదటి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి సినిమాని నాలుగో స్ధానాని వెనక్కి నెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com