మహాశివరాత్రి కానుకగా `జాతిరత్నాలు`

మహానటి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా ఉంటూనే నిర్మాతగా కూడా మారి 'జాతి రత్నాలు' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ ఎంటర్‌టైనర్ కి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించగా, స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ సినిమాని నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది.
ఏడాది కింద మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ ఒక మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంట్లో కాదు థియేటర్స్‌లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం అంటూ వినూత్నంగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాకి రథన్ సంగీతం సమకూర్చగా, సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com