Jawan: బాద్షాకు బన్నీ ఝలక్....

Jawan: బాద్షాకు బన్నీ ఝలక్....
జవాన్ సినిమాలో బన్నీ స్పెషల్ అప్పీరెన్స్ కోసం జరిగిన డిస్కషన్స్...

పఠాన్ సూపర్ సక్సెస్ తో మాంచి ఊపుమీద ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్... ఇప్పుడు జవాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సక్సెస్ ఊపులో ఉన్న షారుఖ్, జవాన్ తోనూ అదే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే సినిమాకు అదనపు హంగులు అద్దేందుకు అసలు వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే పుష్ప సక్సెస్ తో మాంచి ఊపుమీద ఉన్న అల్లు అర్జున్ ను సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ కోసం అడిగారు. దీంతో బన్నీ బాద్షా సిల్వర్ స్క్రీన్ మీద మెరుపులు మెరిపించడం ఖాయమని ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అయ్యారు. కానీ, వారి ఉత్సాహం మీద బన్నీ బకెట్టుడు నీళ్లు గుమ్మరించేశాడు. షారుఖ్ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వాలన్న కోరిక ఉన్నప్పటికీ డేట్లు సర్దుబాటు చేయలేక బన్నీ జవాన్ బృందానికి నో చెప్పాడని టాక్. దీంతో ఫ్యాన్స్ కాస్త డిస్సప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. కానీ, పుష్ప 2మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండటంతో సినిమాలో కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story