జయప్రకాష్‌రెడ్డి తొలి సినిమా ఏంటంటే?

సీనియర్ నటుడు జయప్రకాష్‌రెడ్డి హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. మంగళవారం తెల్లవారుజామున బాత్‌రూమ్‌లోనే ఆయన కుప్పకూలిపోయారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె జయప్రకాష్‌రెడ్డి స్వస్థలం. ఆయన మరణవార్తతో స్థానికంగాను విషాద ఛాయలు నెలకొన్నాయి. 1946 మే 8వ తేదీన జన్మించిన ఆయన వయసు 74 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాటకరంగంపై ఆసక్తే ఆయన్ను టాలీవుడ్‌కు తీసుకొచ్చింది. కాలేజీ రోజుల్లో సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలన్నీ చూస్తూ.. నటపై విపరీతమైన ఇష్టాన్ని చాటుకునేవారు.
విలన్‌గా సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు సహా అనేక చిత్రాల్లో నటించారు. దాదాపుగా అవన్నీ బాక్సాఫీస్ సూపర్‌హిట్లే. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన జయప్రకాష్‌రెడ్డి1988లో టాలీవుడ్‌లోకి వచ్చారు. బ్రహ్మపుత్రుడు ఆయన తొలి సినిమా. ఐతే.. 1997లో ప్రేమించుకుందాం రా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మాటల్లో విరుపులు, తనదైన యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారాయన. ఇక కామిడీ విషయంలోనూ ఆయన టైమింగుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిక్, ఢీ, రెడీ, కృష్ణ, రచ్చ, రేసుగుర్రం, నాయక్, బాద్‌షా, టెంపర్, పటాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో చిత్రాల్లో నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మంగళవారం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందడం ప్రేక్షకలోకంలో విషాదం నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com