Samantha Father : విడాకులు అని తెలియగానే మైండ్ బ్లాక్ అయింది : సమంత తండ్రి

Samantha Father : విడాకులు అని తెలియగానే మైండ్ బ్లాక్ అయింది : సమంత తండ్రి
Samantha Father : టాలీవుడ్ స్టార్లు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

Samantha Father : టాలీవుడ్ స్టార్లు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు వవిడిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో వీరి పెళ్లి ఎంత వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో ఇప్పుడు విడాకులు కూడా అంతే వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తోంది.

వీరిద్దరూ విడాకులు తీసుకోవడం పట్ల అక్కినేని నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించారు. సామ్‌, చైలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కూడా స్పందించారు.

తన కూతురు విడాకుల గురించి తెలియగానే ముందుకు తనకి ఏమీ తోచలేదని, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు. అయితే తన కూతురు స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణిగుతాయని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు. కాగా సమంత తండ్రికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story