18 ఏళ్ళ సింహాద్రి.. బాలయ్య ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?

18 ఏళ్ళ సింహాద్రి.. బాలయ్య ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?
ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ అనేవి కొన్ని మాత్రమే ఉంటాయి. అవి హీరో-హీరోయిన్ అవ్వొచ్చు.. హీరో- డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌‌లో ఎన్టీఆర్- రాజమౌళి ఒకటి.

ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ అనేవి కొన్ని మాత్రమే ఉంటాయి. అవి హీరో-హీరోయిన్ అవ్వొచ్చు.. హీరో- డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌‌లో ఎన్టీఆర్- రాజమౌళి ఒకటి. వీరి కాంబినేషన్‌‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా అటు ఎన్టీఆర్‌‌కి మాస్ హీరోగా, రాజమౌళికి స్టార్ డైరెక్టర్‌‌గా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇది వీరి కాంబినేషన్‌‌లో వచ్చిన రెండో సినిమా. 2003 జులై 9న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌‌ని షేక్ చేసింది. సరిగ్గా నేటికి ఈ సినిమాకి 18ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..!


వసంత కోకిల సినిమా క్లైమాక్స్ నుంచి ఈ సినిమా కథ పుట్టింది. హీరోయిన్‌‌, హీరోను వదిలివెళ్ళిపోయిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుకుంటూ "హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతూంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు లేదూ" అని విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యతో ఈ సినిమా కథకు బీజం పడింది. ఇదే పాయింట్ ని పట్టుకుని ఆయన అసిస్టెంట్ అమ్మ గణేశ్.. హీరోని తాను అమితంగా ప్రేమిస్తున్న హీరోయిన్నే గుండెల్లో గునపంతో పొడిచినట్టుగా కథ రాసుకుందాం అనడంతో అలా చేసేందుకు దారితీసే కారణాలు ఏమిటన్న పద్ధతిలో ఈ కథ రాసుకున్నారు. దీనికి నేపధ్యంగా కేరళను ఎంచుకున్నారు. ఈ సినిమా కథని ముందుగా బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ లో చేయాలనుకున్నారు రచయిత విజయేంద్రప్రసాద్. కానీ అప్పటికే ఇలాంటి కథలను చేశామని బాలయ్య రిజెక్ట్ చేశారు. దీనితో కథ ఎన్టీఆర్ వద్దకి వెళ్ళింది.


ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ కి రెండు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న ఎన్టీఆర్ దాదాపుగా 80కి పైగా కథలను విన్నారు. అలా కలిసుందాంరా ఫేం ఉదయ్ శంకర్ సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఎందుకో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత విజయేంద్రప్రసాద్ చెప్పిన ఈ సింహాద్రి కథకి ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యారు. దొరైస్వామిరాజా నిర్మాతగా రెడీగా ఉన్నారు. అలా సింహాద్రి సినిమా షూటింగ్ మొదలైంది.

ముందుగా అంకిత పాత్రకి ఆర్తి అగర్వాల్ ని అనుకున్నారు. కానీ ఆమె వసంతం సినిమా చేస్తుండడంతో డేట్స్ కుదరకపోవడంతో అంకితను తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ గా భూమికను ఫైనల్ చేశారు.

దాదాపుగా తొమ్మిది కోట్లతో వంద రోజుల పాటు షూటింగ్ చేశారు.

14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

150 ప్రింట్లతో రిలీజైన ఈ సినిమా రెండు రోజుల తర్వాత అసలైన ప్రభంజనం మొదలైంది.

20 ఏళ్లకే బాక్స్ ఆఫీస్ షేక్ చేశాడు ఎన్టీఆర్.

చిరంజీవి తర్వాత అన్నీ విభాగాల్లో దుమ్ముదులిపేశాడు ఎన్టీఆర్. దీనితో ఎన్టీఆర్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది.

180 కేంద్రాల్లో 50 రోజులు, 150కేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులు, 52 కేంద్రాల్లో 175రోజులు జరుపుకొని రికార్డు సృష్టించింది, అప్పట్లో ఇది అల్ ఇండియా రికార్డు కావడం మరో విశేషం.


బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల వరకు వసూలు చేసింది.

ఈ సినిమాని తమిళ్, కన్నడలో రిమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

ఇంత గొప్ప నటనని కనబరించిన ఎన్టీఆర్ కి నంది అవార్డు కానీ ఫిలిం ఫేర్ అవార్డు కానీ రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story