Jr NTR on Akhanda : 'కంగ్రాట్స్ బాల బాబాయ్'.. అఖండ పై ఎన్టీఆర్..!

Jr NTR on Akhanda : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అఖండ.. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందిచారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాలతో నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది ఈ చిత్రం. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో సినిమా పైన సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే సినిమాని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. " ఇప్పుడే సినిమా చూశా.. కంగ్రాట్స్ బాల బాబాయ్... అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్రబృందానికి అభినందనలు.. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయాల్సిన సమయం ఇది" అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా పైన ఇప్పటికే మహేష్ బాబు తదితరులు స్పందించారు.
Just finished watching #Akhanda. Congrats Bala Babai and the whole team on scoring this resounding success.
— Jr NTR (@tarak9999) December 2, 2021
So many hardcore fan moments to enjoy !!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com