NTR: ఉమామహేశ్వరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ..

X
NTR: ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, కళ్యాణ్ రామ్‌లు పరామర్శించారు. సినిమా షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన పిన్ని ఉమామహేశ్వరి కడసారి చూడలేకపోయారు. దీంతో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి నివాసానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీ ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ తల్లితో కలిసి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు నారా భువనేశ్వరి కూడా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
