Jr.NTR : యాస మారినా... మనసు మారదు...!

"ఆర్‌ఆర్‌ఆర్" గోల్డెన్‌గ్లోబ్ పురస్కారం అందుకొని రికార్డులు సృష్టించింది. ఈ పురస్కారం అందుకున్న తరువాత జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ అమెరికన్ యాసలో దడదడలాడించేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్ యాక్సెంట్ చూసి మురిసిపోయినవారు కొందరైతే... విమర్శించిన వారు కూాడా చాలామందే ఉన్నారు.
ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ ట్రోలింగ్ పట్ల జూనియర్ తనదైన శైలిలో హుందాగా బదులిచ్చాడు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనుషులు వివిధ కాల ప్రమాణాల్లో, వివిధ యాసల్లో మాట్లాడుకుంటున్నారు తప్పితే వారంతా ఒక్కటేనని వ్యాఖ్యానించాడు. తూర్పైనా, పడమర అయినా నటులందరికీ ప్రాధాన్యం ఒక్కటేనని, అందులో పెద్ద తేడా ఏమీ ఉండదని ఎంతో పరిణితితో కూడిన సమాధానం ఇచ్చాడు.
అనంతరం రాజమౌళి గురించి మాట్లాడిన తారక్ "ఆర్‌ఆర్‌ఆర్"తో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడని ప్రసంశించాడు. జక్కన్న కేవలం తెలుగు లేదా దేశీయ స్థాయి సినిమాలతో ఆగడని తానెప్పుడూ అనుకునే వాడని అన్నాడు. ప్రతి సినిమాకూ అతడిలో ఎంతో పరిణితి కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. "ఆర్‌ఆర్‌ఆర్" సినిమాతో పశ్చిమాన్ని ఏలేందుకు సన్నద్ధం అవుతున్నాడని తారక్ కొనియాడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com