K Raghavendra Rao: దర్శకేంద్రుడు రచించిన 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' బుక్ లాంచ్..

K Raghavendra Rao: టాలీవుడ్‌లో ప్రేక్షకాధరణ పొందిన దర్శకులు ఎందరో ఉన్నారు. వారందరిలో సీనియర్ మోస్ట్ దర్శకులు కె రాఘవేంద్ర రావు. కె రాఘవేంద్ర రావు సినిమా అనగానే మనకు కచ్చితంగా అతిలోక సుందరి లాంటి నటీమణులు.. కళ్లను కట్టిపడేసే లొకేషన్లు.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలే గుర్తొస్తాయి.. కానీ ఈ దర్శకుడిలో ఓ పుస్తక రచయిత కూడా ఉన్నారని ఇటీవల బయటపడింది. రైటర్‌గా మారి రాఘవేంద్ర రావు రాసిన పుస్తక ఆవిష్కరణ నేడు ఘనంగా జరిగింది.
కె రాఘవేంద్ర రావు సినీ ప్రస్థానం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన తీసిన సినిమాలు, అందుకున్న అవార్డులు.. ఇవన్నీ ఈ జెనరేషన్‌లో దర్శకులు అవ్వాలనుకుంటున్న వారికి పాఠాల్లాగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పటివరకు మనం రాఘవేంద్రరావును ఒక సినిమా రచయితగానే చూశాం. కానీ ఆయనలో ఓ పుస్తక రచయిత కూడా ఉన్నాడు.
దాదాపు అయిదు దశాబ్దాల సినీ ప్రస్థానం కె రాఘవేంద్ర రావుది. ఆ సినీ జీవితాన్ని ఓ కథగా రాసి 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో ఓ బుక్‌ను ఆవిష్కరించారు దర్శకేంద్రుడు. ఈ పుస్తకం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఈ బుక్ లాంచ్ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, రచయిత బీవీఎస్ రవి తదితర దర్శకులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కె రాఘవేంద్ర రావు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com