Kabir Duhan Singh Marriage: ఒకింటివాడైన విలన్

టాలీవుడ్ లో విలన్ గా రాణిస్తోన్న కబీర్ దుహాన్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. ఢిల్లీలోని ఫరీదాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నెచ్చెలి నుదుట తిలకం దిద్దాడు. హర్యాణాకు చెందిన సీమా చాహల్ అనే లెక్కల టీచర్ ను సహధర్మచారిణిగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. జూన్ 21న పూజతో మొదలైన వివాహతంతు, మెహందీ వగైరా కార్యక్రమాలు ముగించుకుని నేడు వివాహ వేడుకతో ముగిసింది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని కబీర్ సన్నిహితులు చెబుతున్నారు. ముందు నుంచి తనను పూర్తిగా అర్థం చేసుకునే అమ్మాయే కావాలని, సినిమాలతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తినే తన జీవితంలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన సహధ్మచారిణితో కొత్త జీవితం ఆరంభించేందుకు కబీర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని సన్నిహితులు వెల్లడించారు.
2015లో జిల్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన కబీర్ తక్కువ కాలంలోనే స్టార్ విలన్ గా ఎదిగాడు. బెంగాల్ టైగర్, కిక్2 , గబ్బర్ సింగ్ వంటి తెలుగు సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు. తమిళంలో వేదాలంలో అజిత్ తో తలపడ్డాడు. ఈ మధ్యకాలంలో శాకుంతలంలోనూ మెరిశాడు కబీర్ సింగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com